బంజారాహిల్స్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా బిగ్‌బాస్ ఫేమ్ శ్వేతావర్మ ఆదివారం జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా శ్వేతావర్మ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిమీద ఉందని, గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనాలంటూ అనీ మాస్టర్, లహరి, డైరెక్టర్ వరుణ్ వంశీలకు చాలెంజ్ విసిరారు.