KBR Park | బంజారాహిల్స్, జూలై 15 : బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు బయట జీహెచ్ఎంసీ పార్కింగ్ స్థలంలో పన్నుచెల్లించని రెండు షాపులను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. సర్కిల్ 18 డీఎంసీ సమ్మయ్యతో పాటు జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం అధికారులు, సిబ్బంది మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని కేబీఆర్ పార్క్ గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 3 పార్కింగ్ స్థలాల్లోని రెండు షాపులను సీజ్ చేశారు. జీహెచ్ఎంసీకి పన్ను చెల్లించకపోవడంతో వీటిని తొలగించామని డీఎంసీ తెలిపారు.