Hyderabad | సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ): మహిళలను, బాలికలను, యువతులను వేధించే పోకిరీలపై రాచకొండ షీ టీమ్స్ ఉక్కుపాదం మోపుతున్నదని రా చకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వెల్లడించారు. బాధిత మహిళలు, యువతులు నిర్భయంగా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు.
ఏప్రిల్ నెలలో డెకాయి ఆపరేషన్లు నిర్వహించి 188 మంది పోకిరీలను పట్టుకున్నామ ని, వారికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు వెల్లడించా రు. బస్టాండ్లు, రైల్లే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీలలో తిరుగుతూ షీ టీమ్స్ డెకాయి ఆపరేషన్ కొనసాగిస్తూ సాక్ష్యాధారాలతో సహా పోకిరీలను పట్టుకొని న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారని తెలిపారు. పట్టుబడ్డ వారిలో 132 మేజ ర్స్,56మందిమైనర్లు ఉన్నట్లు తెలిపారు.
ప్రధాన కేసులు ఇలా ఉన్నాయి.