సైదాబాద్, అక్టోబర్ 9 : ఇంట్లో ఒంటరిగా ఉన్న ఎనిమిదేళ్ల బాలికపై ఇంటి సమీపంలో నివసించే యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డ సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పక్షం రోజుల కిత్రం జరిగిన సంఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఐఎస్ సదన్ డివిజన్లో నివసించే కుటుంబం కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నది.
వారి కుమార్తె (8), కుమారుడు స్థానికంగా ఓ పాఠశాలలో చదువుకుంటున్నారు. పక్షం రోజుల క్రితం పాఠశాలకు వెళ్లి బాలిక, సోదరుడు ఇంటికొచ్చారు. అనంతరం సోదరుడు ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. ఇంటి సమీపంలో నివసించే ఒక యువకుడు (24) తన ఇంట్లోకి ఆ బాలికను తీసుకెళ్లి ఆమెను బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలికపై లైంగికదాడిని చూసిన సోదరుడు తల్లికి జరిగిన విషయం చెప్పాడు. దీంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు.