హిమాయత్‌నగర్,ఆగస్టు8 : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక,రైతు,ప్రజా వ్యతిరేక విధానాలపై బలమైన పోరాటాలు చేయాలని పలువురు వక్తలు పిలుపు నిచ్చారు. శుక్ర వారం హిమా యత్నగర్లోని ఎస్‌ఎన్‌రెడ్డి భవన్లో కేంద్ర,రాష్ట్ర కార్మిక ఉద్యోగ సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్,రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ, సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ, ఐఎఫ్‌టీ యు నేతలు జి.అనురాధ, అరుణ,టీయుసిఐ నేతలు వి.ప్రవీణ్,కేఎస్.ప్రదీప్ మాట్లాడారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్మికుల హక్కులను హరించేందుకు ప్రయత్నిస్తోం దన్నారు. పెట్టుబడి దారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయే తప్ప ప్రజలకు మేలు చేసేందుకు కాదన్నారు. ఈ నెల 13న నారాయణగూడలో కేంద్ర ప్రభు త్వ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ల దిష్టి బొమ్మలను దహనం చేయాలని,సెప్టెంబర్ 22న నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రజా ప్రతినిధులకు కార్మికులు,రైతుల సమస్యల పై వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించడం జరిగిందని వారు తెలిపారు. కార్మిక వర్గం ఉద్యమాలు చేసేందుకు సిద్ధం కావాలని వారు పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో పలు కార్మిక సంఘాల నేతలు ప్రవీణ్‌కుమార్,వంగూరు రాములు,ఎండీ.అంజాద్, వెంకట య్య,రాములు పాల్గొన్నారు.