ఆదివారం 17 జనవరి 2021
Hyderabad - Dec 04, 2020 , 02:58:54

ఓయూ పరిధిలో పలు పరీక్షల తేదీలు ఖరారు

ఓయూ పరిధిలో పలు పరీక్షల తేదీలు ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పోస్ట్‌ ఎమ్మెస్సీ డిప్లొమా ఇన్‌ రేడియోలాజికల్‌ ఫిజిక్స్‌ మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలను ఈనెల 7వ తేదీ నుంచి, ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌) రెండో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలను ఈనెల 15వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్షా తేదీల వివరాలను ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.in లో చూసుకోవచ్చని సూచించారు.