సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఉప్పల్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలను రెసిడెన్షియల్ జోన్లుగా పరిగణించాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావును వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు కోరారు. ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని జై జవాన్ కాలనీవాసుల భూ రిజిస్ట్రేషన్ సమస్య గురించి మంత్రికి వివరించారు. ఉప్పల్ డివిజన్లో దేవేందర్‌నగర్ కాలనీ, అంబేద్కర్ ఆవాస్ యోజన పథకం కింద ఇచ్చిన గృహాలకు లోన్ల మాఫీ గురించి విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు లక్ష్మీనారాయణ కాలనీని ఇండస్ట్రియల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్‌గా మార్చాలని కోరారు. రామంతాపూర్‌లోని కేటీఆర్నగర్ను గతంలో ఉప్పల్ భగాయత్ లే అవుట్లో చేర్చుతూ హెచ్ఎండీఏ నోటిఫై చేసి.. అనంతరం దానిని అభివృద్ధి చేయలేదని, ప్రస్తుతం హెచ్ఎండీఏ నుంచి నోటిఫై చేయాలని, కేసీఆర్‌నగర్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
మీర్పేట్ హెచ్‌బీకాలనీ డివిజన్ డైమండ్ హిల్స్‌కాలనీ ఇండస్ట్రియల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్‌గా మార్చాలన్నారు. చిలుకానగర్ డివిజన్ నార్త్ కల్యాణ్‌పురి కాలనీలో ఓపెన్ లే అవుట్ నుంచి రెసిడెన్షియల్ జోన్‌గా మార్చాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పరిశ్రమలు, మున్సిపల్ శాఖల అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో మంత్రిని చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్, మాజీ కార్పొరేటర్లు గొల్లూరి అంజయ్య, గంధం జ్యోత్స్నానాగేశ్వర్రావు, మేకల హన్మంత్‌రెడ్డి, నాయకులు రేగళ్ల సతీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఆయా కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.