సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Oct 30, 2020 , 06:43:51

సికింద్రాబాద్‌ పాస్‌పోర్టు కార్యాలయం ప్రారంభం

సికింద్రాబాద్‌ పాస్‌పోర్టు కార్యాలయం ప్రారంభం

మారేడ్‌పల్లి : దేశంలో అత్యుత్తమ సేవలు అందించే పాస్‌పోర్టు కార్యాలయాల్లో హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఒకటని కేంద్ర విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌, హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని ఆధునీకరించిన అనంతరం గురువారం వర్చువల్‌ పద్ధతిలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌అలీ, ఎంపీ రేవంత్‌రెడ్డి, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జి.సాయన్న, ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి ఈ. విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అయితే ఇక్కడ పాస్‌పోర్టు సేవలతో పాటు నూతనంగా పీవోఈ, బీఎస్‌, ఐసీసీఆర్‌ కార్యాలయాలు, వెయింటింగ్‌ హాల్‌, మల్టీపర్పస్‌ హాల్‌, కాన్ఫెరెన్స్‌ హాల్‌ సైతం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాస్‌పోర్టు అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా తర్వాత సెప్టెంబర్‌ మాసం మధ్యలో నుంచి 5 పీఎస్‌కేలు, పీవోపీ ఎస్‌కేల్లో పూర్తిగా సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.

ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి బదిలీ

మారేడ్‌పల్లి : హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి ఈ. విష్ణువర్ధన్‌రెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్టు కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిగా విష్ణువర్ధన్‌రెడ్డి సుమారు నాలుగేండ్ల పాటు విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని విదేశాంగ శాఖకు బదిలీపై వెళ్లారు. అయితే ఆయన స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు.