సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో విగ్రహం ధ్వంసం చేసిన కేసును మార్కెట్ పోలీసు స్టేషన్ నుంచి సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఇటీవల దుండగుడు కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలోకి చొరబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
దీంతో స్థానిక ప్రజలు, హిందూ ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. కాగా, దర్యాప్తులో భాగంగా ఇప్పటికే విగ్రహం ధ్వంసం చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విధ్వంసానికి వ్యూహరచన జరిగిన సికింద్రాబాద్‌లోని మెట్రో పోలిస్ హోటల్‌ను సైతం సీజ్ చేశారు. కాగా దర్యాప్తు మరింత వేగవంతం చేసే క్రమంలో కేసును మార్కెట్ పీఎస్ నుంచి నగర సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.