మణికొండ, జూలై 1 : విద్యుత్ ఉద్యోగులు విధి నిర్వహణలో జాగ్రత్తలు విధిగా తీసుకొని ముందుకు సాగాలని సైబర్ సిటీ సర్కిల్ ఎస్ఈ చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం ఇబ్రహీంబాద్ విద్యుత్ డివిజన్ పరిధిలోని నిక్నాపూర్లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ భద్రత వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..లైన్ క్లియర్ పొందిన తర్వాతనే పని చేయాలన్నారు. హెల్మెట్, సేఫ్టీ బెల్ట్ పెట్టుకుని పని చేయాలని సూచించారు. ప్రాణాలు కాపాడటంలో ఎర్తింగ్ అతి ముఖ్యమైనది. కనుక పని ప్రారంభించే ముందు ఎర్తింగ్ తప్పకుండా వాడాలన్నారు.
పనిలో ఉన్నప్పుడు సెల్ఫోన్ వాడకూడదని, మత్తు పదార్ధములు సేవించొద్దన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు, ఉద్యోగులు జాగ్రత్తలపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మోకిలా అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ మేడి రమేష్, ఇబ్రహీం బాగ్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ అంబేద్కర్, చేవెళ్ల అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ రాజేష్, అసిస్టెంట్ ఇంజినీర్లు హాము నాయక్, ప్రదీప్, శివరామకృష్ణ, కోటేశ్వరరావు, ప్రవీణ్, మణికంఠ, సంతోష్, లైన్ ఇన్స్పెక్టర్లు రత్నం, కేడిఎల్ నారాయణ, సురేష్, మురళి, సునీల్, అశోక్, బిక్షపతి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు