సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బుధవారం సాయంత్రం గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 9గంటల వరకు ఉప్పల్లో 1.13సెం.మీలు, సరూర్నగర్, చిలుకానగర్, అస్మాన్ఘడ్, మలక్పేట, తదితర ప్రాంతాల్లో 1.0సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30.6డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21.4డిగ్రీలు, గాలిలో తేమ 73శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.