Supreme Court | హైడ్రాకు ఊరట.. బతుకమ్మకుంటపై హైకోర్టు తేల్చాల్సిదే..!
Supreme Court : హైదరాబాద్‌లోని చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు పాటుపడుతున్న హైడ్రా (HYDRAA)కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
Supreme Court : హైదరాబాద్‌లోని చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు పాటుపడుతున్న హైడ్రా (HYDRAA)కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అంబర్‌పేటలోని బతుకుమ్మకుంటపై నడుస్తున్న వివాదాన్ని హైకోర్టు తేల్చాలని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. బతుకమ్మకుంట ఫెన్నింగ్స్పై హైడ్రా చెబుతున్న అంశాలను పరిశీలించాలని హైకోర్టుకు సూచనలు చేసింది.
భూమి హక్కులకు సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్ ఉన్న నేపథ్యంలో బతుకమ్మకుంట స్థలాన్ని యథాతథంగా ఉంచాలన్న ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించడంపై హైకోర్టు నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. తాము ఆదేశించినప్పటికీ దానిని ఖాతరు చేయకుండా ఆదేశాలకు విరుద్ధంగా పునరుద్ధరణ పనులు చేపట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్య కోర్టు ధిక్కరణేనని తేల్చిచెప్పింది. అయితే.. సుప్రీంకోర్టులో హైడ్రాకు ఊరట లభించింది. బతుకమ్మకుంట కేసుకు సంబంధించిన మొత్తం అంశాలను సమగ్రంగా పరిశీలించిన హైకోర్టుకు తెలిపింది సుప్రీంకోర్టు.
బాగ్ అంబర్‌పేట్‌లో సర్వే నంబర్ 563/1 పరిధిలోని 7 గుంటల భూ వివాదంలో ఏ సుధాకర్‌రెడ్డి హక్కులకు భంగం కలిగించబోమనే హామీకి లోబడి, వరదల నివారణకు పరిమిత పనులు చేపట్టేందుకు హైకోర్టు 2025, జూన్ 12న అనుమతి ఇచ్చింది. ఈ ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించినందున కమిషనర్ రంగనాథ్‌పై ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ సుధాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

