కవాడిగూడ, డిసెంబర్ 31 : సావిత్రిబాయి ఫూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ బి.మణిమంజరి ఆధ్వర్యంలో జనవరి 3న రవీంద్రభారతిలో నిర్వహించే సావిత్రిబాయి ఫూలే జయంతి ఉత్సవాల పోస్టర్ను ఆదివారం దోమలగూడలోని బీసీ భవన్లో ఆవిష్కరించారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రం గౌడ్, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు స్వర్ణగౌడ్, సమత, రేణుకాదీప్తి, సంధ్యారాణి, దేవిక, విజయలక్ష్మి, వాణి, పద్మశ్రీ, లావణ్య, రేణుక తదితరులు పాల్గొన్నారు.