మన్సూరాబాద్: ఎల్బీనగర్లో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆదివారం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆవిష్కరించి..ఘనంగా నివాళులర్పించారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాలను ప్రతి గ్రామ, మండల, పట్టణ కూడళ్లలో ఏర్పాటు చేయాలన్నారు.
పాపన్నగౌడ్ జయంతి, వర్ధంతిలను ప్రభుత్వపరంగా నిర్వహించాలన్నారు. ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి వీరమల్ల వెంకటేష్‌గౌడ్, సహాయ కార్యదర్శి రావుల సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.