బండ్లగూడ,జూన్ 02 : పారిశుద్ధ కార్మికుల సేవలు మరువలేనివని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. హైదరాబాద్ శివారు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వంద రోజుల ప్రణాళికలో భాగంగా మెరుగైన సేవలు అందించిన పారిశుధ్య కార్మికులకు సోమవారం సన్మాన కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ముఖ్య అతిథిగా విచ్ఛేసి వారిని సన్మానించి ప్రశంస పత్రాలను అందజేశారు.అనంతరం మహిళ సంఘల సభ్యులతో కలిసి తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఇతర పార్టీల నాయకులు జెండాలను అవిష్కరించారు. రాజేంద్రనగర్ డివిజన్లో పరిధిలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పొరెడ్డి ధర్మరెడ్డి జెండాను అవిష్కరించారు. బండ్లగూడలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కమిషనర్ శరత్‌చంద్రతో కలిసి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ జెండాను అవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పిరం చెరువు గ్రామంలో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు జెండాను అవిష్కరించి నాడు తెలంగాణ రాష్ట్ర సాధనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషిని గుర్తు చేశారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో డిప్యూటి కమిషనర్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా జెండాను అవిష్కరించారు.