బడంగ్ పేట, మే 3: బాలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఇసుక, కంకర డంపింగ్‌పై ‘పాఠశాలా.. డంపింగ్ యారా’్డ అనే శీర్షికతో ‘నమస్తే’లో కథనం రావడంతో అధికారులు స్పందించారు. పాఠశాల మైదానంలో ఉన్న ఇసుక, కంకర, డస్టును ఏఈ వినీల్ గౌడ్ దగ్గరుండి తీసి వేయించారు.
ఆదివారం నీట్ పరీక్ష ఉండటంతో మైదానంలో ఎలాంటి వస్తువులు ఉండకూడదని పై అధికారుల ఆదేశాల మేరకు వాటిని తొలగించారు. పాఠశాల ప్రాంగణంలో ఇసుక, కంకర, సిమెంట్ వేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి కమిషనర్ సరస్వతిని ఆదేశించారు. పాఠశాలలో ఇసుక, కంకర వేయడమేంటని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.