Sampark Kranti Express | కాచిగూడ, ఏప్రిల్ 4: కర్ణాటక సంపర్క్ క్రాంతి రైలు ఢీకొని ఓ డాక్టర్ మృతి చెందాడు. ఈ ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప, హెడ్ కానిస్టేబుల్ చిమ్నా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం చంచల్గూడ ప్రాంతానికి చెందిన షేక్ మహమ్మద్ అలీ కుమార్తె అలీషా(26) వృత్తిరీత్యా డాక్టర్. శుక్రవారం విధులకు కాచిగూడకు రావడానికి మలక్పేట్ రైల్వే స్టేషన్ రెండో ప్లాట్ఫారం నుంచి ఒకటవ ప్లాట్ ఫారానికి రావడానికి పట్టాలు దాటుతుండగా అదే సమయంలో కర్ణాటక సంపర్క్ క్రాంతి రైలు దూసుకొచ్చింది. రైలు వేగంగా ఢీకొనడంతో అలీషా అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.