హైదరాబాద్ : సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తామని ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి (Sabitha Indra Reddy )అన్నారు. ఆదివారం జల్పల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ను(Jalpally Urban Forest Park) సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో గతంలో 59 లక్షల రూపాయలుతో అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను అభివృద్ధి చేశామన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో జల్పల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు చేస్తే వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ వంటివి సరైన మెయింటెనెన్స్ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి.
అధికారులు తప్పకుండా ఎప్పటికప్పుడు దీన్ని మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే పార్క్‌కు వస్తున్న సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా అన్ని సదుపాయా లు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అక్కడున్న వాకింగ్ ట్రాక్ ఒక కిలోమీటర్ పొడువున కాలినడ కన నడుస్తూ వాకింగ్ ట్రాక్ పై నడిచే వాళ్లని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.