బడంగ్‌పేట, నవంబర్ 5: ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్‌తో దవాఖానలు, మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయించారని మాజీ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీలో నూతనం గా ఏర్పాటు చేయబోయే ఆసుపత్రి స్థలాన్ని మాజీ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రుల అభివృద్ధికి పెద్ద పీట వేశారన్నారు.
జల్పల్లి మున్సిపాలిటీలో ఉన్న జనాభాకు అనుగుణంగా 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడానికి గతంలోనే నిధులు మం జూరు చేయడం జరిగిందన్నారు. ఎంతో మం ది పేదలు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారని గ్రహించి కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందన్నారు. గతంలో ఆ రోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుక పోవడంతో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు రూ.10.70 కోట్ల నిధులు మంజూరు చేయ డం జరిగిందన్నారు. ఆసుపత్రి కోసం ఐదెకరాల స్థలం కావాలని గతంలో వక్ఫ్ బోర్డుకు లేఖ రాయడం జరిగిందన్నారు. అందుకు వ క్ఫ్ బోర్డు వారు సానుకూలంగా స్పందించారన్నారు.
కేసీఆర్ హయాంలోనే మహేశ్వరం నియోజక వర్గంలోని కందుకూరులో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్ట డం జరిగిందన్నారు. కళాశాలతో పాటు 400 ల పడకల ఆసుపత్రి నిర్మాణం చేయడానికి నిధులు కేటాయించి శంకుస్థాపన చేశామన్నా రు. 10 బస్తీ దవాఖానలు, నాలుగు అర్బన్ బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాజకీయాలకు తావు లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేశామన్నారు. విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జల్పల్లి మున్సిపల్ చైర్మన్ ఐమత్ సాదీ, కమిషనర్ వెంకట్రామ్, సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.