బడంగ్పేట్, ఏప్రిల్ 29 .మహేశ్వరం నియోజకవర్గం పరిధి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడలో నీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మహేశ్వరం నియోజకవర్గ టిఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గము నుంచి వేదాదిగా తరలివచ్చి వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం చేసినందుకు నియోజకవర్గ నాయకులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మొన్న వరంగల్ లో జరిగిన మీటింగ్ కి మీరు వచ్చిన తీరు కృషి, పట్టుదలకు భవిష్యత్తులో మీ సహకారం ఉంటుందని భావిస్తూ కందుకూరు మండలం అయితే కానీ మహేశ్వరం మండలం అయితే గాని తుక్కుగూడ మున్సిపాలిటీ, జల్ పల్లి మున్సిపాలిటీ మీర్పేట్, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లు సరూర్నగర్, ఆర్కేపురం డివిజన్ సంబంధించిన ప్రతి ఒక్కరికి అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గస్థాయి కమిటీ కి అందరికీ పేరుపేరునా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేయజేస్తూ సభను సక్సెస్ చేసినందుకు సదా కృతజ్ఞురాలునని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఫోన్ చేసి వారి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినట్లు చెప్పారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడుఒక కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలంటే పైనున్న నాయకుడితో పాటు కింద ఉన్న జెండా పట్టిన కార్యకర్త కు కూడా ఎన్ని ఆటంకాలు ఎదురవుతాయి అని బాగా తెలుసు, ఐనా ఎర్రటి ఎండను కూడా లెక్కచేయకుండా మీరు పార్టీ మీటింగ్ కు అటెండ్ అయ్యి చివరి దాకా ఉండి వచ్చినందుకు మీకు పార్టీ పట్ల ఉన్న కమిట్మెంట్ ఏంటో అర్థం అవుతుందన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇలాగే పనిచేస్తూ ఏ ఎన్నిక వచ్చినా బిఆర్ఎస్ పార్టీ తప్ప గెలుస్తుంది మనందరం ఏకతాటిపై ఉండి ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ డంకా మోగించాలని కోరారు. రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వం అని గంటా పదంగా తెలిపారు.. నియోజకవర్గంలోఎ కార్యకర్తకు అయిన ఏ కష్టమొచ్చిన అందరు ఏకతాటిపై ఉండాలని కోరారు.
లిఖించబడిన పేరు కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.