బండ్లగూడ,జనవరి 25: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఏవని ప్రశ్నిస్తున్నందుకు బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బండ్లగూడ జాగీర్‌కు చెందిన మాజీ వార్డు సభ్యులు వాసవి నవీన్, రాములు, జావీద్బేగ్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ రంగారెడ్డి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి రాజేశ్ తదితరులు వివిధ పార్టీల నాయకులు సుమారు 200 మంది సబితా ఇంద్రారెడ్డి, స్వామిగౌడ్, కార్తిక్రెడ్డిల సమక్షంలో బీఆర్ఎస్ చేరారు.
ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ శివారు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలపడం బాధాకరమన్నారు. శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నాటి మంత్రులు తెలంగాణకు చిల్లి గవ్వకూడా ఇవ్వమని అన్నందుకే తెలంగాణ ఉద్యమం వచ్చిందన్నారు. నాడు కూడా చంద్రబాబుకు తొత్తుగా ఉండి తెలంగాణ ప్రజల పాలిట శత్రువుగా మారిన ఘనత రేవంత్‌రెడ్డిదేనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సమస్యలకు నిలయంగా మారి అస్తవ్యస్తంగా తయారైందని రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి పేర్కొన్నారు.