సమైక్య పాలనలో దగాబడ్డ పల్లెలు.. స్వరాష్ట్రంలో దర్జాగా కాలర్ ఎగురేస్తున్నాయి. సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడిన పల్లెల్లో సకల సౌకర్యాలు వచ్చి చేరాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమంతో ప్రతి పల్లె.. ప్రగతి ముల్లెగా మారింది. గ్రామ పంచాయతీలకు పుష్కలంగా నిధులు ఇచ్చి.. గ్రీన్ బడ్జెట్తో పచ్చని వనాలుగా మార్చారు.

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు పల్లెల్లో కోలాటాలు, బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతాలు లభించాయి. సీఎం కేసీఆర్ సారథ్యంలో పల్లెల్లో జరిగినఅభివృద్ధిపై చర్చించారు.


