మలక్‌పేట, జనవరి 23: మలక్‌పేటలోని ఈస్ట్‌జోన్ ఆర్టీవో కార్యాలయంలో శుక్రవారం సాంకేతిక లోపంతో ఉదయం సర్వర్లు డౌన్ కావటంతో సేవలకు అంతరాయం కలిగింది. దీంతో ఉదయం నుంచి వాహన సేవలు నిలిచిపోయాయి.
వివిధ సేవల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన వాహనదారులతో భారీ క్యూలైన్ ఏర్పడింది. సాంకేతిక సమస్యతో సేవలు నిలిచిపోవటంతో క్యూలైన్లలో నిలబడిన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సర్వర్ల డౌన్‌తో వాహనదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత సర్వర్లు పనిచేయటంతో సేవలు యథావిధిగా కొనసాగాయి.