శేరిలింగంపల్లి : గచ్చిబౌలిలోని హెచ్సియూ డిపోలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్టీసి డ్రైవర్లు, కండక్టర్లకు శేరిలింగంపల్లి : గచ్చిబౌలిలోని హెచ్సియూ డిపోలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్టీసి డ్రైవర్లు, కండక్టర్లకు సోమవారం అభినందన సభ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఫలువురిని డిపో మేనేజర్ పి. శ్రీనివాస్ స్టార్ ఫెర్పార్మర్లుగా గుర్తించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … డ్రైవర్లు, కండక్టర్లు స్టార్ ఫెర్ఫార్మర్లుగా గుర్తించబడేందుకు కృషి చేయాలని, ప్రతి ఒకరు ఇదే స్పూర్తితో ముందుకు నడవాలని కోరారు. మిగతా ఉద్యోగులు సైతం ఆదర్శంగా తీసుకొని తమ ఫెర్పార్మెన్స్ను రెట్టింపు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ రామయ్య తదితరులు ఉన్నారు.