Nandigama | నందిగామ : ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపు తప్పి కారును ఢీకొన్న సంఘటన నందిగామ పాత జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్‌కు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి షాద్‌నగర్ వెళ్తున్నది. డ్రైవర్ నిర్లక్ష్యంగా వేగంగా నడపడంతో.. నందిగామ నూజివీడు సమీపంలోకి రాగానే.. ఎదురుగా ఉన్న వాటర్ ట్యాంకర్‌ను తప్పించబోయి.. హైదరాబాద్ నుంచి షాద్‌నగర్ వైపు వెళ్తున్న ఇన్నోవా కారును ఢీకొట్టింది. దీంతో కారు, బస్సు రోడ్డు పక్కననే ఉన్న చెట్టు, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు, ప్రయాణికులు ఆరోపించారు. ప్రమాదంలో కారు, బస్ స్వల్పంగా దెబ్బతిన్నాయి.