సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ) : బస్సు ప్రయాణికులు షెల్టర్లు లేక వర్షంలోనే తడుస్తున్నారంటూ శనివారం ప్రచురించిన నమస్తే తెలంగాణ కథనంపై ఆర్టీసీ అధికారులు స్పందించారు. హైదరాబాద్లో అత్యవసరంగా నిర్మించాల్సిన 150 షెల్టర్ల ప్రతిపాదనలను జీహెచ్ఎంసీకి అం దించామని తెలిపారు. వారం రో జుల్లో మరోసారి జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకెళతామని వివరించారు.
కాగా నగరంలో బస్సు షెల్టర్ల నిర్మాణం అత్యవసరమని ఆర్టీసీ అధికారులు జీహెచ్ఎంసీకి డిసెంబర్లోనే ప్రతిపాదనలు పెట్టా రు. తరుచూ జీహెచ్ఎంసీ కమిషనర్లు మారడంతో ఎప్పటికప్పుడు ఆ ప్రతిపాదనలు అటకెక్కాయి. వాణిజ్య ప్రకటనలు వచ్చే ప్రాంతాల్లోనే జీహెచ్ఎంసీ బస్సు షెల్టర్లను నిర్మిస్తుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా అవసరాలకు ఉపయోగపడే ప్రాంతాల్లో మా త్రం బస్సు షెల్టర్లు ఏర్పాటులో ని ర్లక్ష్యం వహిస్తున్నారు. డిసెంబర్లోనే జీహెచ్ఎంసీ అధికారులు టెండర్లు ఆహ్వానించి నిర్మాణం చేపట్టి ఉంటే ఈ వర్షాకాలంలో ఆర్టీసీ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లు కాదు.