HomeHyderabadRta Wakes Up To Mirjaguda Overload Accident
ఆలస్యం ఖరీదు.. 21 మంది ప్రాణాలు
జరగాల్సిన దానికంటే పదింతల నష్టం జరిగిన త ర్వాత ఆర్టీఏ అధికారులు మేల్కొన్నారు. ఓవర్ లోడ్‌తో వాహన రాకపోకలపై చర్యలు తీసుకోవాల ని ప్రజా సంఘాలు, ప్రజలు నెత్తినోరు మోదుకున్నా పట్టించుకోని అధికారులు... మీర్జాగూడ బస్సు ప్రమాదంతో కళ్లు తెరుచుకున్నారు.
మీర్జాగూడ ఓవర్ లోడ్ ఘటనతో మేల్కొన్న ఆర్టీఏ
ఆకస్మిక తనిఖీలతో నగరవ్యాప్తంగా హడావుడి
ఒక్క నాగోల్ పరిధిలో మూడు ఓవర్ లోడ్ కేసులు
పటాన్చెరు కేంద్రంగా యథేచ్ఛగా ఓవర్‌లోడ్ కంకర లారీలు
కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లతో తూతూమంత్రంగా ఆర్టీవో, పోలీసు చర్యలు
సిటీబ్యూరో, నవంబర్ 5(నమస్తే తెలంగాణ) : జరగాల్సిన దానికంటే పదింతల నష్టం జరిగిన త ర్వాత ఆర్టీఏ అధికారులు మేల్కొన్నారు. ఓవర్ లోడ్‌తో వాహన రాకపోకలపై చర్యలు తీసుకోవాల ని ప్రజా సంఘాలు, ప్రజలు నెత్తినోరు మోదుకున్నా పట్టించుకోని అధికారులు… మీర్జాగూడ బస్సు ప్రమాదంతో కళ్లు తెరుచుకున్నారు. ఓవర్ లోడ్‌తో ఇస్నాపూర్ నుంచి వికారాబాద్ వెళ్తున్న కంకర లారీ ని నియంత్రించలేని ఆర్టీఏ అధికారులే… తనిఖీలతో హడావుడి చేస్తున్నారు. నిబంధనలను అతిక్రమించి, పరిమితికి మించిన లోడ్‌తో, నియంత్రణ లేని అదుపుతో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నవారిపై ఆర్టీఏ, పోలీసు యంత్రాంగం ఇప్పుడు పంజా విసరడం మొదలుపెట్టింది. దీంతో నగరవ్యాప్తంగా ఒక్క నాగోల్ పరిధిలో కంకర, సిమెంట్, ఇసుక వంటి భవన నిర్మాణ మెటీరియల్స్‌తో వెళ్తున్న వాహనాలను సీజ్ చేశారు.
ఇదే తరహాలో తనిఖీలు చేసి ఉంటే… ఇప్పుడు 21 ప్రాణాలకు ప్రమాదమే ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. నగరంలో రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఓవర్ స్పీడ్‌తో వచ్చిన కంకరలారీ.. ఆర్టీసీ బస్సును తునతునకలు చేసి 21మంది ప్రాణాలను బలితీసుకున్నది. దీనంతటికి ఆర్టీఏ శాఖ విజిలెన్స్ గడిచిన ఏడాది కాలంగా మొద్దు నిద్రలో ఉండటమేనని స్పష్టం అవుతుంది. కనీసం అధిక లోడ్‌తో ప్రధాన రహదారులపై రాకపోకలు సాగించే గూడ్స్ వాహనాలతో కలుగుతున్న ఇబ్బందులపై దృష్టి పెట్టకపోవడంతో నిత్యం ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతూ పదుల సంఖ్యలో వాహనాదారులు ప్రాణాలు కోల్పోతున్నారు.
తూతూమంత్రంగా తనిఖీలు…
ఘటన జరిగిన తర్వాత మేల్కొన్న ఆర్టీఏ, పోలీసు యంత్రాంగం తనిఖీలను ఉధృతం చేసింది. ఓఆర్ఆర్కు సమీపంలో వందలాది సంఖ్యలో ఉన్న క్రషర్, ఇసుక యార్డులు, కంకర, ఇటుక బట్టీలు ఉన్నాయి. ముఖ్యంగా పటాన్చెరు నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ మీదుగా హయత్‌నగర్ వరకు ఎటు చూసినా భవన నిర్మాణ కార్యకలాపాలు విస్తృతంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆదిలాబాద్, మంథ ని, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం నుంచి కూడా ఇసుక లారీలు అధిక లోడ్‌తో నిత్యం రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయి. అధికారులు ఆ విషయంలో దృష్టి పెట్టకపోవడంతో మీర్జాగూడ ఘోర రోడ్డు ప్రమాదం జరగకపోయి ఉండేది. అయితే ఘటన జరిగిన తర్వాత ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో తనిఖీలతో బుధవారం పరిమితికి మించి లోడ్‌తో ఇసుక, కంకర, ఇటుకలను తరలిస్తున్న మూడు వాహనాలను నాగోల్ వద్ద ఆర్టీవో అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. అయితే పటాన్ చెరు లాంటి క్వారీ ఏరియాల నుంచి భారీ వాహనాలు ఇదే తరహాలో నిత్యం రాకపోకలు సాగిస్తున్నా… కాంగ్రెస్ పెద్దల ఆదేశాలతో చూసి చూడనట్లుగా వ్యవహారిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.