హక్కులను కాలరాస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
సీఎంతో పాటుగా హోం మంత్రి రేవంత్‌రెడ్డి కావడం ప్రజల దురదృష్టమని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎద్దేవా చేశారు.యువ సంగ్రామ సభ ప్రాంగణాన్ని సందర్శించిన అనంతరం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎంతో పాటుగా హోం మంత్రి రేవంత్‌రెడ్డి కావడం ప్రజల దురదృష్టమని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎద్దేవా చేశారు.యువ సంగ్రామ సభ ప్రాంగణాన్ని సందర్శించిన అనంతరం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో సంవిధాన్ బచావో అంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని వెళ్తున్నారని, అయితే అదే పార్టీకి చెందిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంవిధాన్ హఠావో అన్నట్లుగా పనిచేస్తున్నారని అన్నారు.
రాజ్యాంగాన్ని పట్టుకుని హక్కులను కాపాడుతానని రాహుల్‌గాంధీ తిరుగుతుంటే, రేవంత్ రెడ్డి హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఎప్పుడైనా రాజ్యాంగం చదివారా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 19, క్లాజ్ 1, సబ్ క్లాజ్ ఏ ఏమి చెబుతుందంటే ఈ దేశంలో ఏ పౌరుడైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు, పక్కవారికి ఇబ్బంది కలుగనంత వరకు అని, సబ్‌క్లాజ్ బీ దేశంలోని ఎక్కడైనా ఆయుధాలు పట్టుకోకుండా సభకు ఎక్కడైనా పెట్టుకోవచ్చని చెబుతున్నదని అన్నారు. తాము సభ కోసం అనుమతుల కోసం అడిగితే ఇవ్వకపోవడం శోచనీయమన్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండాలని కేటీఆర్ ఆదేశాల మేరకు సరూర్‌నగర్ స్టేడియంలో సమావేశం పెడుతున్నామన్నారు. అన్ని విధాలుగా అనుమతులు కోరితే ఎందుకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదో రేవంత్‌రెడ్డి చెప్పాలని అన్నారు. రేవంత్‌రెడ్డి మాట్లాడే భాషతో ప్రజలు కోపోద్రిక్తులు అవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో గ్యాదరి బాలమల్లు, రాకేశ్, కిశోర్ గౌడ్, పాండు గౌడ్, రాంనర్సింహగౌడ్, రాఘవేంద్ర, ఓరుగంటి వెంకటేశ్ గౌడ్, బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, రమేశ్ ముదిరాజ్, శ్రీశైలం యాదవ్, పార్శపు శ్రీధర్, భాస్కర్ గంగపుత్ర, సొంటి చంద్రశేఖర్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

