Hyderabad | హైదరాబాద్ మీర్పేటలో రౌడీ షీటర్ దారుణ హత్య
Hyderabad | హైదరాబాద్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ నందనవనం సూరి దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Hyderabad | హైదరాబాద్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ నందనవనం సూరి దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు నందనవం సూరిపై గతంలో వరంగల్, హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తన మొదటి భార్య, బావమరిది సల్మాన్ హత్య కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. అతనిపై నగర బహిష్కరణ కూడా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తన రెండో భార్య తమ్ముడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు సూరి నందనవనం వెళ్లాడు.
ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ సోదరుడు అఫ్రోజ్ అక్కడకు చేరుకున్నాడు. ముందుగా సూరి కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి, అనంతరం కత్తితో విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన సూరిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే సూరి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు మీర్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

