సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాలో ఇప్పటి వరకు 40 కేసులలో 50 వేల రూపాయలు మించి ఆధారాలు లేని రూ.1.63 కోట్ల నగదును(Cash) జీడీసీకి సిఫార్సు చేశాం. అందులో 37 కేసులకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్న రూ.1.01కోట్ల డబ్బును విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్(Ronaldrose )తెలిపారు.
హైదరాబాద్ జిల్లాలో 50వేల రూపాయలు మించి ఆధారాలు లేకుండా తీసుకువెళ్తున్న , రవాణా చేస్తున్న నగదు రూ.1.63కోట్లను 40 మంది నుంచి ఎన్ఫోర్స్మెంట్ సీజ్ చేసిందన్నారు. సీజ్ చేసిన నగదులో రూ.10 లక్షలు మించి పట్టుబడిన రూ.59,29,00ల నగదుకు సంబంధించి రెండు కేసులను ఆదాయపన్ను శాఖకు రిఫర్ చేసినట్లు చెప్పారు. ఒక కేసులో సీజ్ చేసిన రూ.3 లక్షల నగదును, సరైన ఆధారాలు సమర్పిం చనందున విడుదల కాలేదన్నారు. సంబంధిత వ్యక్తులు సరైన ఆదారాలు సమర్పించి డబ్బు విడుదల చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు.
ఈ విషయంలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఛైర్మన్ 9618888110, కమిటీ కన్వీనర్ మొబైల్ నంబరు 9177872240లలో సంప్రదించవచ్చని తెలిపారు. నగదు సీజ్‌కు గురైన వారు పూర్తి ఆధారాలతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని రెండవ అంతస్తులో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీ కార్యాలయం సంప్రదించాలని సూచించారు.