హైదరాబాద్ : హైదరాబాద్ గోషామహల్లో(Goshamahal) ఉన్నట్టుండి రోడ్డు(Road Damage )ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో ఓ డీసీఎం బోల్తా పడింది. మిగతా వాహనదారులు అప్రమత్తమై తమ వాహనాలను ఆపేశారు. ప్రమాదం జరిగే సమయంలో వాహనం పక్కన ఎవరు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డు కుంగిపోవడంతో అక్కడ భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. కాగా, కొత్తగా వేసిన రోడ్డు కుంగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
గోషామహల్లో కుంగిన రోడ్డు
కొత్తగా వేసిన రోడ్డు కుంగడంతో భయాందోళనలలో స్థానికులు
రోడ్డు కుంగడంతో బోల్తా పడిన డీసీఎం వాహనం.. వాహనం పక్కన ఎవరు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. pic.twitter.com/wDcoDDBhJT
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2024