వెంగళరావునగర్, అక్టోబర్ 22: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 22నెలల పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. బుధవారం వెంగళరావునగర్ డివిజన్ మధురానగర్‌లోని హెచ్ బ్లాక్‌లో వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్యతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. దివంగత మాగంటి గోపీనాథ్‌కు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. రేవంత్ పాలన అవినీతిమయమైందని కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్తున్నారని అన్నారు.
హైడ్రా పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు దందాలు చేస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో బెదిరించి, గూండాగిరి చేసి ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.బెదిరించి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ నేతలను తరిమికొట్టాలన్నారు. జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాథ్ చేపట్టిన అభివృది పనులు, బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఓటర్లు తెలియజేసి వారి చైతన్య పరచాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.