KTR | సినిమా ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్.. గరీబోళ్ల ఇండ్లకు పట్టాలిచ్చిన మహానాయకుడు కేసీఆర్ : కేటీఆర్
KTR | తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, పార్టీకి చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎస్ఐఆర్, పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై దిశానిర్దేశం చేయనున్నారు.
KTR | ఏదైనా సినిమాది ట్రైలర్ రిలీజ్ కాగానే మన పిల్లలు హిట్టా ఫట్టా ని చెప్పేస్తున్నరు. సినిమా టీజర్ రిలీజ్ కాగానే చెప్తున్నరు. సినిమా ట్రైలర్ చూడంగానే సినిమా ఏట్లా ఉందో చెప్పే సత్తా ఉన్న తెలంగాణకు రేవంత్ రెడ్డిది ఇంటర్వెల్ అయేపాయె. ఇక శుభం కార్డు పడి వెళ్లగొట్టేదే ఉన్నది. ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్. 50 శాతం టైం అయిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, పార్టీకి చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎస్ఐఆర్, పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సింపుల్గా చెప్పాలంటే హైదరాబాద్లో ఒక ఇటుక పెట్టలేదు.. ఇల్లు కట్టలేదు. హైడ్రా పేరు మీద కొన్ని వేల వందల ఇండ్లను కూలగొట్టిండు. శనివారం, ఆదివారం వచ్చిందంటే గరీబోళ్ల కొంపల మీద పడి.. ఎక్కడికక్కడ ఇండ్లు కూలగొట్టి దరిద్రపు పేరు సంపాదించుకున్నడు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి మనిషి అని చెప్పేందుకు ఆ ఒక్కఉదాహరణ చాలని కేటీఆర్ అన్నారు.
గరీబోళ్లు తెలిసో తెలియకో ఇళ్లు కట్టుకుంటే కేసీఆర్ 2 లక్షల 50 వేల మంది ఇండ్లకు జీవో నంబర్ 58, 59 కింద పట్టాలిచ్చిన మహానాయకుడు అని కేటీఆర్ స్పష్టం చేశారు. హదరాబాద్లో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించిండు. ఒక్కో నియోజకవర్గానికి 3 వేల చొప్పున ఇప్పటికే ఇచ్చినం. ఇంకో వెయ్యి వీళ్లు ఇస్తున్నరు. మొత్తం తయారు చేసి పెడితే దానికి సున్నం మేమే వేసినం అని చెప్పేవాళ్లు వీళ్లని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Live: ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం
📍 తెలంగాణ భవన్ https://t.co/KeSKthLWFL
— BRS Party (@BRSparty) June 14, 2026
Read also :
Towel Dance | ఫారెన్ రోడ్లపై యువతి టవల్ డ్యాన్స్.. భారతీయుల పరువు తీస్తున్నారని నెటిజన్ల ఫైర్
Ram Charan| రామ్ చరణ్కు సర్జరీ .. RC17 మరింత ఆలస్యం కానుందా, ఆందోళనలో మెగా ఫ్యాన్స్!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

