కుత్బుల్లాపూర్, ఆగస్టు19: కుత్బుల్లాపూర్లో బస్తీలు, కాలనీల్లో కలుషిత నీటితో జనం అవస్థలుపడుతున్నారు. రోగాల బారిన పడుతున్నారు. ప్రధానంగా వాజ్పేయ్నగర్, ఎంఎన్రెడ్డినగర్తో పాటు పలు బస్తీలో ఇటీవల కలుషిత నీటి సరఫరాకు సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా వస్తున్నాయి.
ఇదిలా ఉంటే కలుషిత నీటిని నివారించాలంటే డబ్బులు ఖర్చు అవుతాయని, అందుకు రూ.14 వేలు ఇస్తే చేస్తామంటూ బాహాటంగా అధికారులు తమ సిబ్బంది ద్వారా చెప్పుకొస్తున్నారని ఓ కాలనీకి చెందిన సంక్షేమ సంఘం ప్రతినిధి అధికార గ్రూప్లో పోస్టు చేయడం చర్చానీయాంశంగా మారింది. కలుషిత మంచినీటిని నివారించి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని స్థానికులు కోరుతున్నారు.