రవీంద్రభారతి, ఫిబ్రవరి 6: ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కల్పించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయం అందించాలని పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావుల తో సోషలిస్ట్ కూటమి ప్రతినిధులు అన్నారు. బషీర్‌బాగ్‌లో సోషలిస్ట్ కూటమి ప్రతినిధుల తో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. సోషలిస్ట్ కూటమి జాతీయ చైర్మన్ యల్.జై బాబు మాట్లాడుతూ, ప్రైవేట్ రిజర్వేషన్లో విద్యా, ఉపాధిలో 75 శాతం స్థా నిక కోటా కల్పిస్తూ జార్ఘండ్, హర్యానా రాష్ర్టా లు కల్పించిన ప్రైవేట్ రిజర్వేషన్ చట్టాలు హై కోర్టులు నిలుపుదల చేశాయని, సుప్రీం కోర్టు ఆశ్రయించగా చట్టం చేసే పరిధి రాష్ర్టానిది కాద ని, స్వేచ్ఛా సమానత్వాల ఉల్లంఘన జరుగుతుందని తీర్పులు ఇస్తున్నాయని, అదే బాట లో కర్ణాటక రాష్ట్రంలో చట్టం అమలులో ఉం దని, దీని బాటలో ప్రేవేట్ రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల హామీలో తెలంగాణ, మహారా ష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ర్టాలు ఇచ్చిన హా మీని నిలబెట్టుకోవాలన్నారు.
పారిశ్రామిక వే త్తలు, కార్పొరేట్ దిగ్గాజాలు ప్రతిభను కాపాడాలని, రిజర్వేషన్లను ఎత్తివేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించడం ప్రజాస్వామ్య విలువలను, సామాజిక న్యాయ సూత్రాలకు, దేశ అ భివృద్ధిని ధిక్కరించడమేనన్నారు. దేశంలో ప్ర భుత్వ ఉద్యోగులు కోటి 76 లక్షల మంది ఉం టే ఎస్సీ, ఎస్టీలు కలిపి 5%, ఓబీసీలు 4% ఉన్నారని, 10% కూడా లేని ప్రభుత్వ రంగం లో ఉద్యోగవకాశాలు తగ్గిపోతున్నాయని, 20 50 నాటికి 0.5కి పడిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రైవేట్‌లో రిజర్వేషన్ల కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతామన్నారు. సదానందం, రవి, తిరుపతి, జానకి రాములు, రాజలింగం, బాలకృష్ణ, పాల్గొన్నారు.