జవహర్‌నగర్: డంపింగ్‌యార్డ్ సమస్యతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని, దుర్వాసన నుంచి శాశ్వత పరిష్కారం చూపి ఈ ప్రాంతవాసులకు న్యాయం చేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజాప్రతినిధులు, డంపింగ్‌యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు విన్నవించారు. ఈ మేరకు సోమవారం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిరి ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వజ్రేశ్యాదవ్ల సమక్షంలో సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
అలాగే జవహర్‌నగర్, దమ్మాయిగూడకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని మాజీ మేయర్ మేకల కావ్య, మాజీ చైర్మన్ ప్రణిత వినతిపత్రంలో కోరారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత హరివర్ధన్‌రెడ్డి, డంపింగ్‌యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు శంకర్‌నారాయణ, సమ్మిరెడ్డి, సంజీవరెడ్డి, స్వర్ణశ్రీనివాస్, పద్మాచారి తదితరులు పాల్గొన్నారు.