సిటీబ్యూరో, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): చెరువుల్లో మట్టి పోస్తున్న వారి సమాచారాన్ని తెలియజేయాలని హైడ్రా కోరింది. ఇందు కోసం ప్రత్యేకంగా 9000113667 ఫోన్ నంబర్‌ను కేటాయించింది.అలాగే చెరువులో మట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్ట ర్లు, మట్టిని నింపుతున్న జేసీబీల వీడియోలను కూడా పంపించాలని కోరింది. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో పాటు కళాశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలతో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది.
రాత్రిపగలూ నిఘాపెట్టి నెలరోజుల్లో 31 లారీలను పట్టుకుని సంబంధిత వ్యక్తులపై హైడ్రా కేసులు పెట్టిందని కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో లారీ ఓనర్లతో పాటు నిర్మాణ సంస్థలకు చెందినవారు కూడా ఉన్నారు. ఈ నిఘాను తీవ్రతరం చేసి చెరువుల్లో మట్టి నింపుతున్న వాహనదారులతో పాటు మట్టి తరలించే కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు రంగనాథ్ తెలిపారు. జవహర్‌నగర్‌లో కూ ల్చివేతలు చేపట్టింది హైడ్రా కాదని, ఎక్కడ కూల్చివేతలు జరిగినా వాటిని మొత్తం హై డ్రాకు ఆపాదించి చేస్తున్న తప్పుడు ప్రచారా న్ని ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.