Apollo Pharmacy | షెట్టర్ తొలగించి అపోలో ఫార్మసీలో దోపిడీ

హయత్‌నగర్ : షెట్టర్ తొలగించి అపోలో ఫార్మసీలో దోపిడీకి పాల్పడిన సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, ఫార్మసీ ఇన్చార్జీలు నగేష్, వెంకటేష్ లు తెలిపిన వివరాల ప్రకారం…హయత్ నగర్ డివిజన్ కేంద్రంలోని న్యూఅమ్మ ఆస్పత్రి సమీపంలో కొంతకాలంగా అపోలో ఫార్మసీని నిర్వహిస్తున్నారు.

రోజూ మాదిరిగానే సిబ్బంది ఫార్మసీ షాపును శనివారం రాత్రి మూసివేసి వెళ్లిపోయారు. గుర్తుతెలియని దుండగుడు ఇనుపరాడు సహాయంతో షెట్టర్‌ను తొలగించి లోపలికి ప్రవేశించి డ్రాలో దాచిన రూ.35 వేల నగదును ఎత్తుకుని పరారయ్యాడు. ఆదివారం ఉదయం ఫార్మసీ ఇన్చార్జి వెంకటేష్ వచ్చి చూడగా ఫార్మసీ షెట్టర్ కొంత తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా నగదు కనిపించలేదు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు చోరీకి పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

