దుండిగల్, జనవరి 28: కుత్బుల్లాపూర్ మండలం, గాజుల రామారం రెవెన్యూ పరిధి, కైసర్నగర్లోని సర్వే నం.329 ప్రభుత్వ భూములల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు మంగళవారం కూల్చివేశారు. సర్వే నం. 329లో గతంలోనే కూల్చివేతలు జరుగగా ఇటీవల కొందరు అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా తిరిగి ప్రభు త్వ భూమిని ఆక్రమించారు. అంతే కాకుండా అందులో నిర్మాణాలు చేపట్టి అమాయకులకు వాటిని విక్రయిస్తున్నట్లు కుత్బుల్లాపూర్ మండ ల రెవెన్యూ అధికారులకు సమాచారం అం దింది. దీంతో ఇన్చార్జి తహసీల్దార్ ఆదేశాల మేరకు గిర్దావర్ కలీం, భారీ పోలీసు బందోబస్తు నడుమ జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. మొత్తం 8 నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించినా, ఆక్రమించేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.