కృష్ణ కాలనీ, ఫిబ్రవరి3: జర్నలిజం పేరుతో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ రెడ్డి బిడ్డలను(Reddy community) అగౌరవపరిచి, అన్‌పార్లమెంట్ లాంగ్వేజ్ వాడిన తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna )గత చరిత్ర ఏంటో తమకు తెలుసని రెడ్డి పరపతి సంఘం వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు బిల్లా రాజిరెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం పట్టణ ఉపాధ్యక్షుడు గోలి దామోదర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజిరెడ్డి మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న జర్నలిజం పేరిట అనేక ఆకృత్యాలు చేశాడని అన్నారు.
ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ నేతలకు వంత పాడుతూ కొంతమంది విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి అమాయకులైన బీసీలను ప్రలోభాలకు గురిచేసుకుంటూ మోసపూరితమైన మాటలు చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్న నీచమైన సంసృతి ఆయనదని మండిపడ్డారు. బీసీకి అన్యాయం జరిగిందని తీన్మార్ మల్లన్న వద్దకు పోతే నీవు చేసిన అరాచక పనులు కూడ పూర్తిస్థాయిలో తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు. నీ మోసపూరిత వాగ్దానాలన్నీ ప్రజలకు తెలుసని, ఇకనైనా రెడ్డి బిడ్డలను కించపరిచేలా మాట్లాడితే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు తుమ్మేటి రామ్‌రెడ్డి, కామెడీ మోహన్ రెడ్డి, పాడి మహేందర్ రెడ్డి, పాడి బుచ్చిరెడ్డి, లింగాల రమణారెడ్డి, బుద్దిరెడ్డి మధుకర్ రెడ్డి, రఘునాథరెడ్డి, పోలాల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.