అల్లాపూర్,ఏప్రిల్2: అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావునగర్, స్నేహపూరి కాలనీ, కబీర్‌నగర్ మొదలగు లోట్టు ప్రాంతాల్లో వరద ముంపు సమస్య పరిష్కారం కోసం చేపట్టిన నాలా విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఎక్కడైతే నాలా కుంచించుకుపోయిందో మొదలు అక్కడే పనులు వేగంగా పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ పనులు పూర్తయితే ఇక్కడ ప్రాంతం వారికి ముంపు సమస్య తప్పనుంది.
అల్లాపూర్ ప్రాంతం రామారావునగర్ నుంచి రామారావునగర్, స్నేహపూరి కాలనీ, కబీర్‌నగర్, బబ్బుగూడ వరకు ప్రవహించే నాలా వెడల్పు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నాలా కుచించుకుపోవడంతో వర్షం కురిసప్పుడు నాలాను ఆనుకొని ఉన్న బస్తీలు, కాలనీల్లో రోడ్ల పైకి వదర నీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పతోంది. దశాబ్దాలుగా వర్షాకాలంలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కాలం వెల్లబోస్తున్న దయనీయస్థితి. కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆయన సానుకూలంగా స్పందించి నాలా విస్తరణకు కావాల్సిన నిధులు మంజూరు చేశారు. కేటిఆర్ చేతుల మీదుగా రూ .14కోట్ల అంచనావ్యయంతో శంకుస్థాపన జరిగి నాలా విస్తరణ పనులు శరవేగంగా జరుతున్నాయి. రామారావు నగర్ మొదలుకొని వివిధ కాలనీల్లో మీదుగా బబ్బుగూడ వరకు మొత్తం 1.2కిలోమీటర్ల మేర నాలాకు ఇరువైపులా 5 మీటర్ల వెడల్పుతో ఆర్సీసీ రిటర్నింగ్ వాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 800 మీటర్ల మేర విస్తరణ పనులు జరిగాయని, అన్ని ఆటంకాలను అధిగమించి వేగంగా పనులను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.
నాలా ప్రహరీ నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేసి వరద సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. ఎక్కడైతే నాలా కుచించుకు పోయిందో మొట్టమొదటిగా అక్కడే విస్తరణ పనుల జరిగేలా చర్యలు తీసుకున్నాం.. దాంతో వర్షం కురిసినప్పుడు వరదనీరు రోడ్ల పైకి రాకుండా సాఫీగా వెళ్లేందుకు వీలుగాఉంటుంది. 1.2కిలో మీటర్ పొడువు, 5వీటర్ల వెడల్పుతో నాలాకు ఇరువైపులా ఆర్సీసీ వాల్ నిర్మాణం జరుగతున్నది. ఇప్పటికి వరకు 800 మీటర్ల మేర విస్తరణ పనులు పూర్తిచేసుకుంది. .
– ఏఈ, రంజిత్
వానాకాలం వచ్చిందంటే నాలా పరివాహక ప్రాంతాల్లో నివసించే జనం భయంతో కాలం గడపాల్సిన పరిస్థితి. చిన్న వర్షానికి వరద ఉధృతి పెరిగడంతో ప్రమాదవశాత్తు ఎంతో మంది నాలాలో పడి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నేరవేర్చాలనే సంకల్పంతో మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.14కోట్ల వయ్యంతో పనులు చేపట్టారు. పనులు పూర్తియితే ఇక్కడి ప్రజలకు ముంపు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
– సబీహాబేగం, అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్