Ravi Gupta | సైదాబాద్ : ఒత్తిని అధిగమించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవి గుప్తా అన్నారు. చంచల్గూడలోని సికా పరేడ్‌గ్రౌండ్‌లో బుధవారం తెలంగాణ జైళ్లశాఖ 7వ రాష్ట్రస్థాయి వార్షిక స్పోర్ట్స్ మీట్-2025ని జైళ్లశాఖ డీజీ హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి రవి గుప్త, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ప్రారంభించారు. ఈ సంద్భంగా రవి గుప్తా మాట్లాడుతూ స్పోర్స్ మీట్స్ ద్వారా సిబ్బందిలో శారీరక దృఢత్వంతో పాటు సిబ్బంది మధ్య స్నేహబంధానికి దోహదపడుతుందన్నారు. జైలు ఉద్యోగమనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, ఒత్తిడిని జయించేందుకు క్రీడలు దోహదం చేస్తాయన్నారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. క్రీడా జెండాను ఆవిష్కరించి.. పావురాలు, బెలూన్స్ ఎగుర వేసి.. క్రీడా జ్యోతిని వెలిగించారు. ఇక క్రీడలు బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. కార్యక్రమంలో జైళ్ల శాఖ ఐజీలు రాజేశ్, డీఐజీలు మురళీ బాబు, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీనివాస్, సంపత్, చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.