వెంగళరావునగర్: భద్రాద్రి కొత్తగూడెం ఆర్డీవోగా పని చేస్తున్న రత్నకళ్యాణి భర్త ఎన్వీ చంద్రశేఖర్ (58)ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాపూనగర్ బస్తీ సాయికృప అపార్ట్మెంట్స్ ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం.. సాయికృప అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటుండగా వీరి కుమారుడు అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న చంద్రశేఖర్ చికిత్స తీసుకుంటున్నారు.
మంగళవారం ఉదయం రత్నకళ్యాణి దంపతులు కొత్తగూడెం నుంచి ఎస్ఆర్నగర్లోని తమ ఫ్లాట్‌కు వచ్చారు. విధుల్లో భాగంగా రత్నకళ్యాణి లోకాయుక్త కార్యాలయానికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న చంద్రశేఖర్ కొక్కానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.