బంజారాహిల్స్,జూన్ 13: కార్లను అద్దెకు తీసుకుని పక్క రాష్ట్రం లో విక్రయించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే.. అత్తాపూర్‌కు చెందిన రషీద్ బంజారాహిల్స్‌లో కార్యాలయం పెట్టి కార్లను లీజుకు ఇస్తుంటాడు. గత ఏడాది నవంబర్‌లో అతని వద్ద బండ్లగూడకు చెందిన మహ్మద్ జాహెద్ అలీ.. డిఫెండర్, ఫోర్డ్ ఎండీవర్ కార్లను అద్దెకు ఇచ్చాడు.
నెలనెలా జాహెద్ అద్దె చెల్లిస్తున్నాడు. అయితే ఇటీవల జాహెద్ .. మహారాష్ట్రకు వెళ్లి అద్దెకు తీసుకున్న రెండుకార్లను ఇతరులకు విక్రయించాడు. కాగా.. మహారాష్ట్రలో కార్లు విక్రయిస్తుండగా జాహెద్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో బంజారాహిల్స్ నుంచి రెండుకార్లను తెచ్చి అమ్మేసినట్లు చెప్పాడు. దీంతో వారు రషీద్‌కు స మాచారం ఇచ్చారు. తన నుంచి కార్లు అద్దెకు తీసుకుని విక్రయించిన జాహెద్‌పై కార్ల యజమాని శుక్రవారం బం జారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.