Sri Ranganathaswamy Temple | జియాగూడ, మే 24 : జియాగూడ శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా రంగనాథస్వామి రథోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. రథోత్సవానికి మందు శ్రీ దేవి భూదేవి సమేత రంగనాథస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం అఖండ హారతి అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు. స్వామివారి రథోత్సవం ఆలయం నుండి ప్రారంభమై పురానాపూల్ వరకు కొనసాగి తిరిగి ఆలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తిరువెంగళాచార్యులు, ప్రతినిధి శేషచార్యులు, ప్రధాన అర్చకులు శ్రీనివాస రంగనాథచార్యులు, బద్రినాథ్ చార్యులు, ఏసీపీ కిరణ్కుమార్, మధిర సత్యనారాయణ, ముళ్లేరామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.