ఎల్బీనగర్ జోన్‌బృందం, ఏప్రిల్ 22 : రంజాన్ పర్వదినాన్ని శనివారం ఘనంగా జరుపుకొన్నారు. నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన అనంతరం రంజాన్ పర్వదినం రోజున పెద్ద ఎత్తున ఈద్దాల్లో ముస్లింలంతా ప్రార్థనలు చేశారు. సరూర్‌నగర్ ఈద్గాలో ప్రార్థనల అనంతరం ముస్లింలకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, రాచకొండ సీపీ చౌహాన్, డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ శ్రీధర్‌రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ చౌహాన్ ముస్లిం చిన్నారులకు చాక్లెట్లు, మిఠాయిలు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భవానీప్రవీణ్కుమార్, జక్కల శ్రీశైలం యాదవ్, బోయిని మహేందర్ యాదవ్, బేర బాలకిషన్, బబ్బురి ఆనంద్‌కుమార్ గౌడ్, శ్రీధర్ గౌడ్, నర్రె శ్రీనివాస్ కురుమ, భాస్కర్, శ్రీధర్, మైనార్టీ నాయకులు మహ్మద్ సలీం, మహ్మద్ జహీర్, ఖాజా, ఆసిఫ్, తదితరులు పాల్గొన్నారు.