శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 26: అర్హులైన నిరుపేదలందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు అందజేస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని హమీదుల్లానగర్ గ్రామంలో నిర్మించిన డబుల్‌బెడ్ రూం ఇండ్లను తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘లక్కీ డ్రా’ పద్ధతితో అర్హులై ఇరవై మంది లబ్ధిదా రులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ .. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో డబుల్‌బెడ్ రూం ఇండ్లు అద్భుతంగా నిర్మిం చి ఇస్తున్నామని, దీంతో పాటు ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వానికి అభివృ ద్ధి సంక్షేమ అనే రెండు కండ్లలాంటివని అన్నారు.
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన విధానాలతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని, దేశంలో విప్లవాత్మ క మార్పులు తీసుకొచ్చి గుణాత్మకమైన పాలనను అందించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకా లు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, అభివృద్ధి ఫలాలను క్షేత్ర స్థాయిలో ప్రజలను చైతన్యవంతులుగా చేయాలని పార్టీ శ్రేణులు సూచించారు. ఇండ్లు వచ్చిన లబ్ధిదారులు ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, వైస్ ఎంపీపీ నీలంనాయక్, పీఏసీఎస్ చైర్మన్ దవాణాకర్గౌడ్, హమిదుల్లానగర్ గ్రామ సర్పంచ్ వట్టెల సతీశ్‌యాదవ్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కే.చంద్రారెడ్డి, ఎఎంసీ చైర్మన్ దూడల వెంకటేశ్ గౌడ్, మంచర్ల మోహన్‌రావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, లబ్ధిదారులు, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.