బండ్లగూడ, జనవరి10: ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన బుద్వేల్ గ్రీన్ సిటీ కాలనీలో రూ.60లక్షలతో నిర్మించనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ అర్చన జయప్రకాశ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు మాజీ సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పేర్కొన్నారు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌ను దేశంలోనే నంబర్‌వన్ పోలీస్‌స్టేషన్‌గా కేంద్ర ప్రభుత్వం గురించి ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేతుల మీదుగా రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ అవార్డును కూడా అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ బుధవారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఏసీపీ గంగాధర్, ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబును సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి ద్వారానే రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు ఈ అవార్డు వచ్చిందని అన్నారు. అవార్డు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అర్చన జయప్రకాశ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మైలార్‌దేవ్‌పల్లి : తెలుగుదనం ఉట్టిపడే పండుగ సంక్రాంతి అని ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ అన్నారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లక్ష్మీగూడలో బుధవారం బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాళ్లు అడికే లావణ్య, శరణమ్మల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.బీఆర్ఎస్ డివిజన్ యువ నాయ కులు రఘుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.