బండ్లగూడ, డిసెంబర్ 30: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. కిస్మత్పూర్ గ్రామలో ప్రజా పాలన కేంద్రాన్ని పరిశీలించి.. మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఇచ్చేందుకు చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని దరఖాస్తులను అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహేందర్‌గౌడ్, డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్‌రెడ్డి, కమిషనర్ శతర్చంద్ర, సంగారెడ్డి నాయకులు సురేశ్‌గౌడ్, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సైదాబాద్, డిసెంబర్ 30: మలక్‌పేట, యాకుత్‌పురా నియోజకవర్గంలో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శనివారం ప్రశాంతంగా కొనసాగింది. యాకుత్‌పురా నియోజకర్గంలోని పలు కౌంటర్లను ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ సందర్శించి జీహెచ్ఎంసీ అధికారులకు తగు సూచనలు చేశారు. ఆస్తిపన్నుల విభాగం ఇన్స్పెక్టర్ ఇమ్మాన్యూల్ పలు ప్రాంతాల్లో పర్యటించారు.
శంషాబాద్ రూరల్, డిసెంబర్ 30: దరఖాస్తుల స్వీకరణలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సుల్తాన్‌పల్లి గ్రామ సర్పంచ్ దండుఇస్తారి అధికారులకు సూచించారు. సమావేశంలో ఎంపీటీసీ సంగీత, ఎంపీవో ఉషా, వ్యవసాయ విస్తరణ అధికారి రాఘవేందర్, ఉప సర్పంచ్ స్పందనగౌడ్, వార్డు సభ్యులు చంద్రశేఖర్, మాల కృష్ణ, విరచారి, సత్యమ్మ, పంచాయతీ కార్యదర్శి ప్రదీప్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
మణికొండ, డిసెంబర్ 30: నార్సింగి మున్సిపల్ పరిధిలోని ప్రజా పాలన కేంద్రాలను నార్సింగి మున్సిపల్ నోడల్ ఆఫీసర్ శ్రీనివాసులు పర్యటించి ప్రజా పాలన నిర్వహణపై కమిషనర్ సురేందర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఫల్గుణ్కుమార్ ఆయా వార్డుల వద్ద ఏర్పాట్లు, కొనసాగుతున్న పని తీరును సమీక్షించారు.
మైలార్‌దేవ్‌పల్లి, డిసెంబర్ 30: ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా దరఖాస్తులు స్వీకరించాలని రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ ఉపకమిషనర్ రవికిరణ్ సూచించారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బాబుల్‌రెడ్డినగర్‌లోని దరఖాస్తులు స్వీకరిస్తున్న కేంద్రాలను పరిశీలించారు.