కాచిగూడ,అక్టోబర్ 26: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి పాలకులు బీసీలను ఓటు బ్యాంక్‌గా వాడుకుంటు న్నారని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్పటేల్ గౌడ్ ఆరోపించారు. ఆదివారం కాచిగూడలో విలేకరుల ఆయన మాట్లాడుతూ.. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ఆ పార్టీని బీసీలు గెలిపించారని పేర్కొన్నారు. బీసీల పోరాటల ఫలితంతో ప్రభుత్వం దిగివచ్చి 25 శాతం నుంచి 42 శాతానికి పెంచిందన్నారు.
బీసీ రిజర్వేషన్లపై అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి వద్దకు తీసుకోకపోవడం, సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ది లేక కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించక పోవడం, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో భూషన్ భాస్కర్, పి.కృష్ణ, ముత్యాల్రావు, డాక్టర్ ప్రశాంత్ నిమ్కర్,సత్యపాల్‌సింగ్, ప్రదీప్‌గౌడ్, పాల్గొన్నారు.